ఏమయ్యిందమ్మా
నీకు...
అమ్మవు నీవే....
అమ్మనే అని చెప్పుకున్నావు...
నా బిడ్డ జాగ్రత్త అన్నావు...
నా కొడుకును
బాగా చూసుకోండి అన్నావు...
నా బిడ్డను ఒంటరి
చేయవద్దని అన్నావు....
అమ్మ మనసు తాపత్రయమది...
అమ్మలోని అనురాగమది...
అమ్మలోని కమ్మదనమది...
అమ్మలోని అమృతమది...
అమ్మతనానినికి
కరిగిపోయాను...
అమ్మ మనసుకు
చలించిపోయాను...
నిజమే
అమ్మవే నీవు....
నాలుగు పదుల నా వయస్సు
నీ ఒడిలో సేదదీరింది...
అమ్మ నాకుందని పులకించిపోయింది....
మరేమయ్యిందమ్మా నీకు...
నన్ను దూరం చేస్తున్నావు...
పరుల పాపం నాపై
రుద్దుతున్నావు...
నేనేపాపమూ చేయలేదమ్మా...
బాధ్యతల సమరంలో
నలిగిపోయానమ్మా ...
ఎందుకమ్మా అలా అంటావు...
నీ మాటలు గుండెను ఛిద్రం
చేస్తున్నాయమ్మా...
ఒక్కసారి నావైపు నుంచి
అలోచించమ్మా...
నీ అమ్మ మనసు నాకు తెలుసు...
అయినా ఆ మనసు నాకు గాయం
చేస్తూనే ఉందమ్మా...
నీ అమ్మ మనసు మీద ఆన
కనీసం సవతి తల్లిలానైనా
ప్రేమించవా అమ్మా...
మళ్ళీ ఒక్కసారి
ఒడి చేర్చుకోవా అమ్మా...
నీ బిడ్డగానే
మరణించాలని ఉంది
మనస్వినీ...
No comments:
Post a Comment