Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Sunday, 15 February 2015

రేపటి ఆశ...



రేపటి ఆశ...

వచ్చే ప్రతి క్షణం వెళ్ళిపోయేదే...
ప్రతి ఘడియా పారిపోయేదే..
ఇప్పుడున్నది
అప్పుడు ఉండదు...
ఈ రోజున్నది
రేపు ఉండదు ...
వెళ్లిపోయింది మళ్ళీ రానే రాదు...
రమ్మన్నా అది తిరిగి చూడదు...
లిప్తపాటులో
మాయమవుతుంది గతం...
తిరిగిరాని కాలంలా
గతానుభావాలన్నీ
మళ్ళీ మళ్ళీ రానే రావు...
నేడున్న నా ఆలోచన
రేపు ఇలా ఉండకపోవచ్చు...
అనుభవాల నుంచి
సరికొత్త పాఠం తెలుసుకోవచ్చు...
నేడున్న పరిస్థితి
రేపు ఉండకపోవచ్చు...
అది ఇంతకన్నా
తీయనిదే కావచ్చు...
రేపన్నది చేదని
ఇప్పుడే ఎందుకు అనుకోవాలి...
అది మరుపురాని
అనుభవమే అవుతుందేమో ...
అడియాస ఆలోచనలు మాని
ఆశగా కొత్త కాలం కోసం
ఎదురుచూపులు
ఎంతో మధురం ...
కాలానిదే తప్పేమో
నా మనసు ఎప్పుడూ
మజ్బూర్ కాదు
మనస్వినీ...

No comments:

Post a Comment