ద్రోహి
ఓ కుసుమం నేలరాలింది
ఓ పుష్పం వాడిపోయింది
స్నేహ సౌధం
కుప్పకూలింది
ద్రోహిపురుగు రెక్కలు
విప్పింది
పచ్చని తోట
వాడిపోయింది
మంచిలోనూ
చెడులోనూ
మనం ముగ్గురమని
అనుకుంటూ
చేసుకున్న బాసలు
చెరిగిపోయాయి
మనిషిగా కనిపిస్తూనే
మనీషిగా వ్యహరరించిన
ద్రోహి
వికృత రూపం దాల్చిన
వేళ
ఓ మనసు చచ్చిపోయింది
ఓ వ్యక్తిత్వం
మసకబారింది
ఆలోచనకే అందని అవమానం
బహుమానంగా దక్కింది
లెక్కలు వేసుకోని
మనసుకు
లెక్కలున్నాయని తేలింది
చేయని నేరం చెలిమిని
కాటేసింది
మనీషి చేసిన ద్రోహం
మాయని మచ్చగా
మిగిలింది
No comments:
Post a Comment