జీవితమే శాసిస్తోంది
Raaho me chalthe
chalthe hum peeche hi rahegaye!
Kaarvan tho guzar gaya ham dhoolme
milgaye!
Jindagiko ishara karthe the hum!
Ab tho jindagike hi gulam hogaye hum!
నాడు
నా చూపే శిలాశాసనం
కోరిన వైభవం పాదాలను
ముద్దాడింది
నా కంటి వెలుగులకై వెన్నెలే
తహతహ లాడింది
నా స్నేహం కోసం సమాజం బారులు
తీరింది
అందరి వాడినే నేను
అందరికీ నేనే
నేనే అందరూ
మంచితనాన్ని ముద్దాడా
నిజాయితీని ఆరాధించా
మంచి చెడులను గాలికి వదిలి
మనసు మాటకే ప్రాణమిచ్చా
ప్రతిఘడియా నాదే
ప్రతి సన్నివేశమూ నాదే
అవును నేను
జీవితాన్నే శాసించా
ఇప్పుడు
జీవితమే నన్ను శాసిస్తోంది
మనస్వినీ
No comments:
Post a Comment