తుషారపు సంతకం
ఒక నుదుటిపై తుషారపు సంతకం నేను
ఒక చెక్కిలిపై చిలిపి రాతను
నేను
ఒక పెదవిపై మెరిసే రేఖను నేను
ఒక కంటిలో వెలిగే కాంతి పుంజం
నేను
ఒక కన్నీటి చుక్కలో లీలగా
కనిపించే రూపమే నేను
కాలమనే యవనికపై చెరగని ముద్రను
నేను
జ్ఞాపకాల దొంతరలో రాలిపడే
ముత్యం నేను
ఒక గానమై ప్రవహించే జీవనంలో
తారాడే పల్లవిని నేను
ఒక చిరునవ్వుగా
ఒక కన్నీటి చుక్కగా
ఒక జ్ఞాపకంగా
పాటలో పల్లవిగా
నా అడుగుల సవ్వడి నిత్యం
వినిపిస్తూనే ఉంటుంది
మనస్వినీ
No comments:
Post a Comment