నువ్వే నువ్వే
ఎలా అనుకోను
ఎందుకు అనుకోను
నువ్వు నువ్వే కాదని
అంటే
నీ ఉనికే లేదని
వాదిస్తే
మనసెందుకు
ఒప్పుకుంటుంది
తనలో రేగే సుడిగుండాలు
తనలో పూచే పూదోటలు
తనలో సవ్వడి చేసే
సరాగాలు
కేవలం కల్పనలే
అనుకుంటే
మనసుకు ఎందుకు
నచ్చుతుంది
మనసులోని భావాలు
మనసుకే తెలుసు
మనసు ఆలోచనలు మనసేగా
రుచి చూసేది
అక్షరాలను కట్టడి
చేయగలం
భావాలను బంధీ చేయగలం
ఘడియలను చెరిపేయగలం
అనుభవాలను కాదనగలం
అన్నీ కల్పనలే అని
అన్నీ రాతలేనని
అక్షరాల అల్లికలేనని
పదాల విన్యాసాలేనని
తేలికగా తేల్చేయగలం
ఊహాసుందరి నుంచి
మనస్వినిని చేరుకున్న
పయనం
ఆగిపోయింది
మనస్విని మైలురాయిని
చేరిన అన్వేషణ
అక్కడే ఆగిపోయింది
రాతలను ప్రశ్నించిన
చందానా
మనసును బంధించగలమా
నవ చైతన్య కెరటమే
నా మనస్వినీ
No comments:
Post a Comment