తోటమాలి
పచ్చదనాల పూదోటలో
రతనాల గులాబీ
ఎర్రని మెరుపులు
లలితమైన సొగసులు
అందచందాల పూరాణి
చల్లని నీటి తిమ్మెరలు
మనసును తాకే సమీరాలు
అప్పుడప్పుడూ
ఉషోదయపు కిరణాల స్నానాలు
పూదోటకే మణిహారం
ఆ పువ్వుల రాణి
అందమైన జాబిల్లి
ఇంతలో ఏమయ్యిందో
సమీరం కరిగిపోయింది
నీటి తిమ్మెరలు ఆవిరైపోయాయి
వైభవం జారిపోయింది
తోట వాడిపోయింది
సడలని దీక్షను పొందిన పువ్వు
ఇప్పుడు మండే ఎండలను
దిక్కరిస్తోంది
తన రెక్కలనే ఆయుధాలుగా మలుచుకుని
తిరుగుబాటు చేస్తోంది
ఒక మనసు కన్నీరు కారుస్తోంది
తన మనసు పువ్వు దుస్థితికి
రోధిస్తోంది
ఆ మనసు తోటమాలిది
మనస్వినీ
No comments:
Post a Comment