చిగురించేనా
నాటి వసంతం
ఏవి మనసా
నాడు మురిపించిన
మనసు మంజీరాలు
నాడు పరిమళించిన
మనసు కుసుమాలు
నాడు కురిసిన వెన్నెల రాత్రులు
నాడు మనసును తాకిన
చల్లని సమీరాలు
నాడు పాదాలను ముద్దాడిన
విజయతీరాలు
నాడు రవళించిన విజయధ్వానాలు
ఏవి మనసా
నాడు తారాడిన కలల చంద్రికలు
చుక్కల వాన కోరితే
ఉల్కాపాతం కురిసిందా
అలలతో పోటీ పడితే
సునామీ మింగేసిందా
వెన్నెల వానలో కన్నీరే
కురిసిందా
కలల చంద్రికలు పుడమిలో
కలిసిపోయాయా
విజయతీరాలు ఎండమావులేనా
ఏవి మనసా
నా కన్నులు పరుచుకున్న కలల
తివాచీలు
గడిచిన అనుభవాలు
మనసులో మొగ్గలు వేసిన అనుభూతులు
నాటి వసంతం మరలా చిగురించేనా
మనస్వినీ
No comments:
Post a Comment