మాయని మచ్చవు నీవు
నిన్నేమని పిలవాలి
స్నేహానివా నీవు
నేస్తానివా నీవు
స్నేహం ముసుగులో మోసానివా...
ఎందుకు వంచన చేశావు
ఎందుకు కుటిలనాటకం రచించావు
మేకవన్నె పులివా నీవు...
ఎంత తీయగా మాట్లాడావు
ఆపదలో చేయూతగా నిలిచావు
మనసులో ఇంత పెట్టుకుని
ఎందుకు ఇలా చేశావు
పచ్చి వ్యాపారమేనా నువ్వు...
హితుడిగా నమ్మి
స్నేహితుడిగా మనసు పంచుకున్నా
నేను పలికిన పలుకులకు
మసిపూసావు ఎందుకు నువ్వు...
నీ మాటలు వినలేదు
నీ ప్రణాళికలు చూడలేదు
మనసుతో వ్యాపారం చెయ్యలేదు
ఎందుకు నీఛానికి ఒడిగట్టావు నువ్వు...
నా జాతిని అంటావు
నా నీతిని ప్రశ్నిస్తావు
మరి తప్పుడు మార్గం చూపిన నువ్వు
ఏ జాతిలో పుట్టావో
అడగగలవా నీ అమ్మను నువ్వు...
నా నడతకు
నా వ్యక్తిత్వానికి
నా చరిత్రకు
మాయని మచ్చగా మిగిలావు నువ్వు
నువ్వు చేసిన ప్రచారం నిజమే అయితే
అంతరించాలి నా భవిత...
నీకు తెలుసు నువ్వొక అబద్దమని
ఒక సంకరజాతివని
ఫలితం అనుభవించక తప్పదని...
Hitudu kaadu snehitudu kaadhu
ReplyDelete