మారని సమాధానం
తెల్ల కాగితం కాదు నా
మనసు
పిచ్చిరాతలు
రాసుకోలేదు
వలదనుకుంటే
చెరుపుకోలేను
వానకు తడవనిది
ఎండకు ముడుచుకోనిది
కెరటాలకు తలవంచనిది
సునామీలకు జడవనిది
సుడిగుండాలకు చెదరనిది
నిత్యం వికసించే
కుసుమం నా మానసం
అవును తెల్లకాగితం
కాదు నా మనసు
అది జ్వలించే గుండె
కవాటం
ఎగసిపడే ఆవేశం
వికసించే కమ్మని గీతం
గుండె లోతుల్లో
ఉరుకులుపెట్టే రుధిరం
ఎన్నటికీ చెదరని
శిలాశాసనం
మనసును తాకే
మంత్రాక్షరం
రాలుపూల మకరందం
నా అంతరంగం
ఘడియలు మారినా
సన్నివేశాలు చెదిరినా
మమతలు ప్రశ్నలు వేసినా
ఎన్నటికీ
మారని సమాధానమే నా
హృదయం
మనస్వినీ
No comments:
Post a Comment