శిలనై మిగిలిపోయా
Lagtaa nahin hai dil meraa ujday dayaar mein
kis ki bani hai aalam-e-naa paayedaar
mein
kah do in hasraton se kahin aur jaa basein
itani jagah kahaan hai dil-e-daagdaar mein
జఫర్ కలం నుంచి
జాలువారిన భావం
గుండె కొలనులో మొలకలు
వేసిన గానం
ఒక వేదన
ఒక రోదన
గూడుకట్టిన నిస్తేజం
అదే భావం
అదే గానం
ఇప్పుడు నా మనసు తోటలో
చివుర్లు తొడుగుతోంది
ఎందుకు ఇలా
అనిపిస్తోంది
రోజూ కూసే కోయిలగానం
అవే పిచ్చుకలు
అదే సందడి
ఎందుకు ఇంపుగా లేవు
ఎందుకు మానసం
కలవరపడుతోంది
ఎందుకు ఏదీ నచ్చటం
లేదు
వెన్నెల చల్లదనంలో
చితిమంటలు ఎందుకు
కనులజారిన స్వప్నాలు
కాలిపోతున్నాయి ఎందుకు
ఇదేనా నేను కోరిన
జీవితం
ఒక నిష్క్రియాపర్వం
ఆవరించిన నిస్తేజం
ఏదీ చేతకాని వైనం
ఎందుకు మనసు నిలకడగా
లేదు
ఎందుకు ఈ అల్లకల్లోలం
వేగంగా సాగుతున్న
కాలాన్ని అందుకోలేక
శిలనై నిలిచిన భావం
ఏమో తెలియదు గాని
మనసులో మనసు లేదు
మనస్వినీ
No comments:
Post a Comment