Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday, 7 April 2016

నీ మెడచుట్టూ గులాబీలు

నీ మెడచుట్టూ గులాబీలు

నిత్యం భావనా సమరం చేసే నేను
ఒకింత మార్పు కోరుకున్నా
స్వగతంలో మార్పును నాటుకుంటూ
నవ్యంగా ఏదో రాసుకోవాలనుకున్నా
మనసూ మమతలకు దూరంగా
ఆవేదనకు రోదనకు
ఎగసిపడే ఆవేశానికి భిన్నంగా
కొత్త భావప్రపంచానికి
అంకురం వేయాలనుకున్నా
బలంగా కళ్ళు మూసుకున్నా
ఒక్కో ఆలోచనకు
ఒక్కో సంకెల వేసుకున్నా
గుండెనిండా గాలి పీల్చుకుంటూ
సరికొత్త భావాలకు శ్రీకారం చుట్టుకున్నా
భారంగా ముద్రలు వేసే అక్షరాలను
దూది పింజాలుగా మలుచుకుని
కొత్త కవిత్వానికి బాటలు వేసుకున్నా
అదేంటో
ఏం జరిగిందో
నా భావనల వరవడిలో
అంతర్లీనంగా నువ్వే కనిపించావు
కీ బోర్డుపై నాట్యం చేసే చేతివేళ్ళకు పోటీ పడుతూ
పరుగులు తీస్తున్న అక్షరాలు
నీ వైపే దూసుకుపోతున్నాయి
అప్రయత్నంగానే నా భావాలు
నీ మెడచుట్టూ గులాబీల్లా అల్లుకుంటున్నాయి
అవును
నా అక్షరాలు
మరో భావానికి ప్రాణం పోయలేమంటూ
తిరుగుబాటు చేస్తున్నాయి
మనస్వినీ

No comments:

Post a Comment