రాక్షసుడిలా మార్చొద్దు
ఎవరు మీరు
దేవుళ్ళా
దేవతలా
మీ మనసులో పుట్టిందే
వేదమా
మీరనుకున్నదే శాసనమా
మీరు చెప్పిందే
న్యాయమా
మీరు చేసేదే
నిజాయితీనా
ఎలా నిర్ణయిస్తారు ఒక
వ్యక్తిత్వాన్ని
ఎలా నిర్దేషిస్తారు ఒక
జీవితాన్ని
ఎలా తప్పు పడతారు ఒక
మనిషిని
ఎలా నిందిస్తారు ఒక
జాతిని
ఎందుకు తలవంచాలి మీ
కుటిల నీతికి
మీకు తెలియదా మీరు
చేసేది తప్పని
మీ మనసుకు తెలియదా
మీదే ద్రోహమని
మనీ వస్తుందని అంటే
సొంతమనిషిని
పరమనిషి దగ్గరికి పంపే
మీరు మనిషి జాతేనా
ఒక జాతిని
ఒక మతాన్ని బేరీజు వేస్తూ
మనిషి నిజాయితిని
నిర్దేశించే మీరు
ఒక్కసారి మీ తల్లిని
అడిగి చూడండి
ఏ జాతిలో పుట్టారో
మీ వికృత స్వరూపాలను
చూస్తే కోపం కాదు
జాలి వేస్తోంది
నోటికి వచ్చిన
ప్రచారంతో తలమునకలై
ముఖాముఖికి బెదిరిపోయే
మ్మిమ్మలని చూసి
నవ్వు వస్తోంది
నోరుంది మీకు
మాట్లాడండి
మీ నోరు మీ ఇష్టం
ఒక సమయం వస్తుంది
ఒక ఘడియ పలకరిస్తుంది
కనీసం కన్నెత్తి చూసే
ధైర్యం కూడా మీకుండదు
జర జాగ్రత్త
మనిషిని రాక్షసుడిలా
మార్చొద్దు..
No comments:
Post a Comment