Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Friday, 22 April 2016

అలా ఉంటానా ఇలా ఉంటానా

అలా ఉంటానా ఇలా ఉంటానా

అప్పుడప్పుడూ అంటూ ఉంటావు
నేనున్నప్పుడు ఒకలా
లేనప్పుడు ఒకలా ఉంటావని...
నీ మాటల్లో అర్థం ఏదైనా
పలుకుల్లో శూలాలు గుచ్చుకున్నా
నీవన్నది నిజమే...
నేనలాగే ఉంటాను
నువ్వున్నప్పుడు ఒకలా
లేనప్పుడు ఒకలా...
అలా ఉంటానా
ఇలా ఉంటానా
అది మనసు చెప్పే నిర్ణయం...
నీవున్న వేళ నీతోనే ఉంటా
నీ సాంగత్యాన్ని చవిచూస్తా
నీ మాటలు వింటా
తూటాలూ తింటా
ముభావమైనా
పరాచికమైనా నీతోనే...
నీవు లేని వేళ
నీవు నమ్మలేవు ఇది నిజం
నేను నీతోనే ఉంటా...
అందరిలో నేనున్నా
అంతరంగంలో నువ్వే
నేను నవ్వుతూ ఉన్నా
ఆ చిరునవ్వులో నువ్వే...
ఒంటరినై ఉన్నా
ఆలోచనల్లో నువ్వే...
నువ్వున్నవేళ కన్నా
లేనివేళనే నాతో ఎక్కువగా ఉంటావు...
ఇది మనసుకు మాత్రమే తెలిసిన నిజం
మనసు మాత్రమే చూడగలిగిన నిజం
మనస్సినీ...

No comments:

Post a Comment