Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday, 14 April 2016

నేరం చేసిన మనసు

నేరం చేసిన మనసు

Matlab ki duniya hai yeh
Hum matvaalonki jagaah kahaan!
Hum aise hai hum vaise hai
Sab hi kehte hai !
Is dilko padke dekhne waale kahan !
అవును
నాలో అణువణువునా స్వార్ధమే
నా ఆలోచనల్లో
నా అంతరంగంలో
నేను చేసే ప్రతి పనిలో
అంతర్లీనంగా కనిపించేది స్వార్ధమే
ఏదీ అనుకోలేదు
ఏదీ ఆలోచించలేదు
బాధ్యతలను పట్టించుకోలేదు
జీవనగమనంలో నాకు దక్కనిది
సంధ్యాసమయంలో దక్కినదని మురిసిపోయా
రాలిపడుతున్న చుక్కల్లో ఒక తారక
నా ముంగిట నిలిచిందని తోడునయ్యా
తారక మెరుపులు
ఆ మనసు మమతలు
ఎన్నడూ రుచి చూడని అనుభూతులు
గులాముగా మారిపోయింది నా మనసు
ఆ తారక వైభవం
తనతో నడిచే ఐశ్వర్యం
సిరులూ సంపదలూ
రతనాల రాశులు
నప్పలేదు నా మనసుకు
బతికేందుకే  సంపద అనుకున్నా
ఆనందమే జీవన మార్గమని నమ్మా
నా మనసు తనకు దాసోహమయ్యింది
నిజమే
ఇది నా స్వార్ధమే
ఒక రకంగా కపటమే
నా మనసే ఆ కపట నాటకం రచించింది
ఎవరికీ
ఎన్నటికీ
అర్థమేకాని
స్వార్థాన్ని కోరుకుంది నా మనసు
మరి నేను స్వార్థపరుడినే కదా
మనస్వినీ

1 comment:



  1. నేరము చేసెను మనసున
    ఘోరము జేసెను జిలేబి గోప్యము గోరెన్
    తారక ముంగిట నిలెచెను
    వారగ త్రోసెను తరుణము వాకిట రాగన్ !

    ReplyDelete