నమ్మితేనే నమ్మకం
మసకేసిన మబ్బులను చీల్చి చూడు
మనో నేత్రం తెరిచి చూడు
నమ్మకమైన చూపులతో చూడు
మనసు పుటలను కదిపి చూడు
నా కళ్ళల్లో నిజాయితీని
పలకరించి చూడు
నా మనసులో మమతను కదిలించి చూడు
కనులనిండా నీ రూపమే
మనసు నిండా నీ నామమే
పరకంటితో నన్ను కదిపి చూడకు
పరవాక్కుతో నన్ను పలకరించకు
నాలో నీకు ద్రోహమే కనిపిస్తుంది
నాలో నిన్ను మోసమే పలకరిస్తుంది
నన్నెలా చూడాలన్నది
మనసులోని నమ్మకమే చెబుతుంది
మనస్వినీ
No comments:
Post a Comment