ఉన్నావా నువ్వు
నీ గడపపై తల ఆన్చిన
నేను
కన్నీళ్ళతోనే
పలకరించాను
మౌనభాషతోనే కుశలమడిగాను
మనసులో సుడులు తిరిగిన
వేదననే
నీ పాదాలకు పుష్పాలుగా
అలంకరించాను
నా శ్వాసతోనే నీకు
వింజామరలు
విసురుకున్నాను
నీ దరి చేరిన నేను
కొద్దిగా దూరం జరిగి
మౌనంగా ఉండిపోయినా
నా మనసు మాత్రం నీతో
మాట్లాడుతూనే ఉంది
నాలో రేగిన వేదనలను
రోదనలుగా చెబుతూనే
ఉంది
సర్వంతర్యామివి
నువ్వేనని
అన్నీ నీకే
చెప్పుకున్నా
రత్న రాశులు
కోరుకోలేదు
కీర్తి ప్రతిష్థలు
అడగలేదు
కాసింత ప్రశాంతత
ఇవ్వమని వేడుకున్నా
అందరి మనసులు తెలుసు
నీకని అంటారు
నీకు తెలియకుండా ఏదీ
జరగదని అంటారు
మరి నా మనసు గోస నీకు
వినరాలేదా
విన్నా మౌనంగానే ఉండిపోయావా
నేడు నిన్ను
తూలనాడుతున్న నేను
నాడు కన్నీటితో నీకు
అభిషేకం చేయలేదా
నేను చేసిన నేరమేమి
నీ బాటలో నడవటమే పాపమా
మనసును మన్నించి
జీవితాన్ని వ్యాపారం
చేసుకోలేదు నేను
అదే పెద్ద తప్పిదమా
ఎందుకు మౌనంగా ఉన్నావు
మసీదు గోడలలో
బంధీవయ్యావా
శిలారూపంలో
కదలలేకున్నావా
శిలువదిగి రాలేనని
మిన్నకుండిపోయావా
ఏమీ చేయని నువ్వు
ఏమీ చేయలేని నువ్వు
ఆకారమే లేని నువ్వు
శిలగా మిగిలిన నువ్వు
అసలు నువ్వు నువ్వేనా
అదంతా ఒక కల్పనా
అసలు ఉన్నావా నువ్వు
దేవుడనే వాడుంటే ఈ
మనుషులు
దయ్యలుగా ఎందుకు
మారుతారు
మనస్వినీ
Kuwait Nri's, is a kuwait based multilingual web portal which emphasizes on covering news from kuwait, India, Middle East, USA and all over the world. The site also keeps in view of all types of reader groups with different mindsets, age groups and also gender tastes and keep needs in mind and covers.. PLEASE VISIT www.kuwaitnris.com
ReplyDelete