నా కథ అమరం
ఓ స్వప్నం
అస్తమించింది
కన్నీటి సుడులలో
కరిగిన ఓ కల
నేల జారింది
సూరీడులా వెలిగిన
వైభవం
పడమర దిశన ఒరిగింది
ఇక సెలవంటూ
మనసు మూగగా రోధించింది
తెలుసు మనసుకు
ఇదే అంతమని
నలువైపులా సమరమే
జరుగుతోందని
ఊహించని రీతిలో
దిగ్బంధనం
జరిగిపోయిందని
రెప్పపాటు పరిణామం ఇది
కానే కాదని
కలిసి నడిచిన అడుగులకు
జాడలే కాదు
బాటలు కూడా
కరిగిపోయాయని
అన్నీ తెలిసినా
ఎందుకో మనసు
విలపిస్తోంది
ఎవరికీ అర్థం కాని
సవ్వడిలో
ఆర్తనాదాలు పెడుతోంది
నా మనసుకు
తెలిసిపోయిందా
ఇక తన కథ అమరమని
No comments:
Post a Comment