మూలపురుషుడి డి ఎన్ ఏ
అప్పుడప్పుడు ఒక భావన
మదిలో మెదులుతూ
ఉంటుంది
నేనెవరినని
నాది ఏ మతం
నాది ఏ జాతి
నేను ముస్లింనేనా
నాలో ప్రవహిస్తున్నది
ముస్లిం రక్తమేనా
నిజంగా నేను ముస్లింనా
ఏది నమ్మకం
నా వెనుక పది తరాలు
వారి తాతలు ముత్తాతలు
వారి అయ్యలు అమ్మలు
అందరూ ముస్లింలేనా
ఎవరూ మతం మారలేదా
ఎక్కడా తప్పు దొరలలేదా
ఎలా చెప్పగలను నాది
ముస్లిం రక్తమేనని
నాకు తెలిసిన ఓ
బ్రాహ్మణోత్తముడున్నాడు
పరమతమంటే ఎగిరెగిరి
పడతాడు
పరజాతి నీఛమని అంటూ
అవాకులు చవాకులు
పేలుతుంతాడు
నిజానికి ఆయనా
ముస్లిమేనేమో
ఆయనలో ప్రవహించేది
ముస్లిం రుధిరమేనేమో
ఎవరికి తెలుసు ఆయన
మూలమేమిటో
ఆయన వెనుకటి తరాలు
ఎవరో
గుండె మీద
చెయ్యేసుకుని చెప్పగలడా
ఏమో ఆయన మూలాల్లో ఎవరో
ముస్లిం ఉన్నారేమో
సంచారజాతి ఆదిమానవుడు
ఎన్ని దేశాలు తిరగలేదు
ఆ జాతి సంతానం ఇప్పుడు
ఎక్కడ ఏ మతంలో ఉన్నారో
చెప్పగలమా
అందరి రక్తంలో ఎక్కడో
కల్తీ జరిగే ఉంటుంది
ఆఫ్రికా మూలాలు
ఇండియాలో
ఇండియా మూలాలు
మరెక్కడో
మరి మన రక్తం కల్తీ
కాదని ఎలా చెప్పగలం
మతం మనిషి జీవన విధానం
అది రక్తంలో ఎక్కడా
కనిపించదు
మన మూల పురుషుడి డి ఎన్
ఏ ఏమిటో
ఎవరైనా చెప్పగలరా
మనిషిగా బతకండి
మనుషులుగా బతకనీయండి
ఎందుకురా
మతం జాతి అంటూ మిడిసిపడతారు
మూల పురుషుడి డి ఎన్ ఏ
తేల్చుకో ముందు
ఏమో నువ్వు హిందూ
కాదేమో
ముస్లింలో ఉన్నది
హిందూ రక్తమేనేమో
అది తెలుసుకో ముందు
తులసీ దాసు వంద సం. క్రితమే భయే వర్ణ సంకర్ అని తేల్చేశారు......ఇప్పుడు అంతా కలగాపులగం..... కానీ దీన్లో ఏదీ పవర్ లేదు. అందుకే కొట్టుకు చస్తున్నారు. ముందు ముందు ఇంకా చస్తారు. ఇది నేను చెప్పిన మాట కాదు.... మా గురువుగారు చెప్పినది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే రైటే అనిపించదూ(ప్రశ్న)
ReplyDelete