Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday 4 December 2014

విషాద వీచికను..


విషాద వీచికను..















నా మనసుకు ...
నీ మనసు జత చేరితే...
నా అంతరంగాల సుడులు ....
నీ మనసునూ అల్లకల్లోలం చేస్తాయి...
నా అడుగుల జాడల్లో....
నీవు నడిస్తే...
నా పాదాలకు గుచ్చుకున్న  ముళ్ళు...
నీ పాదాలకూ గుచ్చుకుంటాయి..
నా స్వప్నాలను ...
నువ్వు స్వప్నిస్తే....
నా బాధ్యతల ఉప్పెనలో...
చెదరిపోతావు...
నా భావనలకు ....
నువ్వు మూలమయితే...
నా కవితల్లో...
ఒక విషాదంగానే.......
మిగిలిపోతావు...
నా కంటే బాగా మాట్లాడేవాళ్ళు...
నాకన్నా బాగా రాసే వాళ్ళు...
వస్తుంటారు...
వెళుతూ ఉంటారు...
కన్నీటి సుడుల...
పునాదుల మీద నిలిచిన...
విషాద వీచికను నేను...
సర్వం కోల్పోయిన ....
శిధిల రాజ్యానికి అధినేతను నేను..
మనస్వినీ...

No comments:

Post a Comment