Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Friday 12 December 2014

ఇది చాలదా నాకు..



ఇది చాలదా నాకు..
 
అందమైన కొలనులో...
కలువ బాలలా...
పూదోటలో ముద్దబంతిలా...
జాబిలమ్మలో ...
సిరివెన్నెలలా...
విరిసిన మల్లెపై...
కురిసిన మంచు బిందువులా..
నిత్యం నువ్వు నా తోనే ఉన్నావు...
నా చెంతనే నడియాడుతున్నావు...
నీ నవ్వుల పువ్వులు...
నా పైనే రువ్వుతున్నావు...
నీ పలుకుల మల్లికలు...
నా పైనే కురిపిస్తున్నావు...
అయినా నీలో నేను లేను..
నాలో మాత్రం నువ్వే ఉన్నావు..
ఎన్నటికీ ఉంటావు...
ఈ జీవితానికి ...
ఇది చాలదా...
నేను నీవాడిని కాకున్నా..
నీవు నాదానివి కాదా..
మనస్వినీ...

No comments:

Post a Comment