Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday 11 December 2014

అన్నీ నావే...



అన్నీ నావే...
 




















తన ప్రమేయమే లేదా.... 
తన ప్రమేయం లేకుండానే కలిసానా...
తన ప్రమేయం లేకుండానే ప్రేమించానా...
గుండె లో గుడి కట్టి...
దేవతలా ఆరాధించా...
నా భావనలకు .....
మూలవస్తువుగా  మలిచి....
గుండె పుస్తకంలో అక్షరాలను...
ఏరుకుని ...
కవితలుగా అల్లుకున్నా...
ఊహల్లో విహరించా..
నా కలలు నావే...
నా ఊహలు నావే...
తన తప్పేముంది....
కలలను కథలుగా...
అల్లుకొమ్మని తను చెప్పిందా...
తప్పంతా నాదే...
తన ప్రమేయం లేకుండా ...
జరిగినదానికి....
ఆమెకేం బాధ్యత..
నా గుండెలో ఆలోచనలు...
నా భావనల్లో వేదనలు...
నా కన్నీటి రోదనలు...
నా ఆనంద భాష్పాలు...
అన్నీ నావే...
తన ప్రమేయమేముంది...
మనస్వినీ...

No comments:

Post a Comment