Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Sunday 21 December 2014

నేములో నేముంది...



నేములో నేముంది...
పేరు మారితే ఏముంది...
ఆ పేరులో ఆ మతం...
ఈ పేరులో ఈ మతం ...
పేరులో నేముంది...
మనసులో ఉండాలి కానీ...
పేరు మారితే ...
మనసు మారుతుందా...
మనిషిలోని ఆలోచన మారుతుందా...
అవే ఆలోచనలు...
అవే అంతరంగాలు...
అదే రక్తం ...
అదే హృదయం...
పేరు మారితే ...
మారేది...
తెగిపోయేది ...
కేవలం ...
బంధమే కదా...
బంధం అనుబంధమే ...
కానప్పుడు...
ఏ పేరుంటేనేమి...
మనస్వినీ...

1 comment:


  1. భలే వారండీ ! నేము లేక పోతే మేము లేదు కదా !!

    జిలేబి

    ReplyDelete