Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Tuesday 30 December 2014

ప్రేమాన్వేషణ...



ప్రేమాన్వేషణ...

అన్వేషణ నాది ...
ఆరాటం నాది...
ఆతృత నాది...
తపన నాది...
అదెలా ఉంటుందో ...
రంగు ఏదో ...
రుచి ఎలా ఉంటుందో...
దానినిపొందాలనీ...
ఆస్వాదించాలనీ..
మైమరిచిపోవాలనీ...
లీనం కావాలనీ...
స్వంతం చేసుకోవాలనీ...
నిజం తెలుసుకోవాలనీ...
అవును నా అన్వేషణ...
ప్రేమ కోసమే...
ప్రేమించానేమో...
ప్రేమను మాత్రం పొందలేక పోయాను...
అందుకే ఆరాటం...
నా ప్రేమ పోరాటం...
నా పిచ్చికానీ...
నీలోనే నాకు ప్రేమ ...
దొరకనప్పుడు ....
నా అన్వేషణ ...
వృధా ప్రయాస కాదా ...
మనస్వినీ...

No comments:

Post a Comment