Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday 25 December 2014

నన్ను వీడిపోయింది...



నన్ను వీడిపోయింది...

నీతో నేనుండలేను...
నీలో ఇమడలేను...
నీ మనసులో ఉండటం ...
నాకెంత మాత్రం ఇష్టం లేదు...
ఇంతకాలం నీ గుండెలోనే...
కాపురమున్నా...
ఇంకా ఉండలేను...
నీ వేదనలూ...
నీ రోదనలూ ...
నేనింకా ఓర్చుకోలేను...
నీ హృదయం లో కొలువై ఉన్నా...
నీ ప్రతి కణం లో నేనే ఉన్నా...
నీ ఆలోచనలో ఉన్నా...
నీ అంతరంగంలో దాగి ఉన్నా...
నీ గుండె మంటలను...
ఇంకా భరించలేను...
నిన్ను విడిచి వెళుతున్నా...
సెలవంటూ...
జారిపోయింది ...
నా కన్నీటి చుక్క...
నా కన్నుల్లో కొలువై ఉన్న ....
ఆ నీటి చుక్క ...
నా చెంపను ముద్దాడుతూ...
జారి పడితే...
ఎందుకో ...
నా మనసూ తేలికపడింది...
మనస్వినీ...

No comments:

Post a Comment