Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Tuesday 9 December 2014

అవును నిన్నే చూస్తాను...


అవును నిన్నే చూస్తాను...


అవును నీకు ....
నవ్వులాట అనిపించవచ్చు...
ఇది నిజం అన్నింటిలో ...
నేను నిన్నే చూస్తాను...
రాసే పెన్నులో...
తెల్లకాగితంలో....
విసిరేసిన చిత్తు కాగితంలో...
నాకు నువ్వే కనిపిస్తావు...
నా కలం సిరా....
అక్షరాలుగా జాలువారితే...
ఆ పొందికైన అక్షరాల...
అర్థం పరమార్థం...
నువ్వే అయినప్పుడు...
ఆ కలంలో ఎక్కడో దాగి ఉన్నది..
నీ రూపమే కాదా...
తెల్లని కాగితం...
నా మనోభావనలను....
తన గుండెలపై...
అద్దుకుంటే.....
అది నీవు కాక ఇంకెవ్వరు...
వెలిగే జాబిలిలో....
కురిసే వెన్నెలలో.....
నవ్వే పువ్వులలో....
నిన్ను చూసే నేను...
కలం కాగితంలో...
చూడలేనా...
మనస్వినీ...

No comments:

Post a Comment