Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Wednesday 24 December 2014

చిత్రమే...



చిత్రమే...

 
చిత్రం నిజంగా చిత్రమే...
చిత్రం పలుకుతోంది...
ఊసులు చెబుతోంది...
బాసలు చేస్తోంది...
చిత్రంగా అనిపించినా...
ఆ చిత్రమే నాతో మాట్లాడుతోంది...
నిజంగా నిజం...
నెచ్చెలీ...
నువ్వు నాతో ఉన్నా ...
దూరాన తరలిపోయినా...
పగలయినా ...
చీకటయినా...
నా మనోఫలకంపై ...
రూపుదిద్దుకున్న ...
నీ చిత్రం నా ముందు ...
కదలాడుతోంది...
ప్రేమగా చేతులు చాస్తోంది...
ఆర్తిగా హత్తుకుంటోంది...
ఆవేశంతో రగులుతోంది...
నువ్వున్నా లేకున్నా...
నా కంటిపాపతో ...
నిమిత్తం లేకుండా ...
నువ్వెప్పుడూ...
నాతోనే ఉన్నావు ...
మనస్వినీ...

No comments:

Post a Comment