Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Sunday 7 December 2014

అనుబంధం..



అనుబంధం.. 

 
మనసులో ఏవో సరాగాలు...
ఎదలోతుల్లో ఏవో భావనా తరంగాలు...
అర్థం కాని అంతరంగాలు....
విరబూసిన ఓ పువ్వును చూస్తే...
ఊగిసలాడే మనోభావాలు...
అంతలోనే మరో పుష్పం...
మనసు పొరల్లో మళ్ళీ సవ్వడులు...
లోకమంతా పూదోటైన భావనలు...
పువ్వు పువ్వులో మారే నవ్వులు...
అయినా ఆగలేదు మదిలో రొదలు....
మనసుకు నచ్చే పువ్వుకోసం పరుగులు..
పువ్వులకే నవ్వులు నేర్పే...
నిన్ను చూసి ఆగాయి నా అడుగులు...
ఎందుకంటే  నేను....
సీతాకొక చిలుకను కాను ...
అనుభవం కాదు...
నాకు అనుబంధం ముఖ్యం ...
మనస్వినీ..

No comments:

Post a Comment