Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Saturday 20 December 2014

శర పరంపర...



శర పరంపర...
తన చూపుడు వేలుతో ...
నా పైనే గురి...
ఆ వేలు నాపై ప్రశ్నలు సందిస్తోంది...
ఒకటి కాదు ...
రెండు కాదు...
ఎన్నెన్నో ప్రశ్నలు...
ఒకదాని వెంట ఒకటి...
శర పరంపరగా...
ఆ ప్రశ్నలు నా గుండెను...
ఛిద్రం చేస్తూనే ఉన్నాయి...
ఓ ప్రశ్నలో అనుమానం ...
మరో ప్రశ్నలో అవమానం...
నా నిజాయితీకే కళంకం...
నా వ్యక్తిత్వానికే భారం...
ఈటెల్లా గుచ్చుకుని...
గాయం రేపుతున్న ...
ఆ ప్రశ్నల ధాటికి...
ఒకింత కలవరం..
మరింత గగుర్పాటు..
అసత్యాల పునాదుల్లో...
జనియించిన ఆ ప్రశ్నలకు..
నాదగ్గర సమాధానముంది...
మరి...
ఒక వేలు నావైపు...
చూపిస్తుంటే...
మిగిలిన ఆ నాలుగు వేళ్ళు...
తన వైపే చూపిస్తున్నాయి...
ఆ నాలుగు వేళ్ళు ...
అడుగుతున్న ...
వందల ప్రశ్నలకు...
జవాబులు ఎందుకు లేవు ...
మనస్వినీ...

No comments:

Post a Comment