Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Saturday 6 December 2014

పదిలం సుమా...


పదిలం సుమా...
చిరునవ్వులే చిందించావు... 
ఆ పెదాలపై  మెరుపులేవీ...
ఆహ్లాదంగానే మాట్లాడావు...
నీ పలుకుల్లో  ఆ చైతన్యమేదీ...
నాకే ధైర్యం చెప్పావు...
మరెన్నో జాగ్రత్తలు చెప్పావు...
మరి నీలో ధైర్యమేదీ...
మాట్లాడుతూనే...
వీడ్కోలుగా  చేయి ఉపుతూనే...
రెండు నిమిషాల్లోనే ...
ముందుకు కదిలావు...
వెళుతూ వెళుతూ ...
నాపై పడిన నీ చూపు నాకేం చెప్పింది...
ఆ కన్నులు ఏదో దాచుకుని...
తమ నుంచి బయటికి రానీయకుండా ...
ఎంత మధన పడ్డాయి...
అయినా ఆ కనురెప్పల మాటున ..
కనిపించీ కనిపించకుండా...
జారి పడిన ...
ఓ నీటి చుక్క..
అప్రయత్నంగానే ...
చెప్పింది  నాకు వీడ్కోలు..
మనస్వినీ....

No comments:

Post a Comment