Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Saturday 13 December 2014

సైకత పుష్పాన్ని....




సైకత పుష్పాన్ని....

 
సైకత వీదుల్లో....
వికసించిన పుష్పాన్ని...
ఎడారి తిన్నెలపై...
కురిసిన స్వాతి చినుకును...
పడమట దిక్కున ....
ఉదయించిన సూరీడుని...
పున్నమి ఎలా ఉంటుందో ....
తెలియని చందమామని...
సువాసనలు వెదజల్లని ...
ప్లాస్టిక్ పువ్వుని...
తడి ఆరిన కన్నీటి చుక్కని...
జీవమే లేని...
దరహాసాన్ని...
నాలో పువ్వులు ...
నవ్వినా ...
నవ్వులు రువ్వినా...
ఎదను తాకని సమీరాలే...
మనస్వినీ...


No comments:

Post a Comment