Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Friday 12 December 2014

నిరీక్షణ...



నిరీక్షణ...




ఉప్పొంగే కడలి కెరటాలు....
సముద్రుడి గర్భంలోకి జారుకున్నా...
ఎగసిపడే సాగరం మౌనముద్రలోకి చేరుకున్నా...
జవమూ జీవమూ అయిన....
గాలి అలలు అలిగిపోయినా....
పాల వెన్నెల జాబిలమ్మ.....
మసకబారి పోయినా...
కాంతిమూర్తి సూరీడు....
నిశిలోకి తరలిపోయినా...
ఒక్కటేమిటి....
సర్వం ప్రకృతి స్థంభించిపోయినా....
నా గుండె అలలు మాత్రం...
నీకోసం...
ఎగసిపడుతూనే ఉంటాయి...
నా మది తలుపులు...
నీకోసం..
తెరుచుకునే ఉంటాయి..
నీ చిరునవ్వుల కటాక్షం కోసం...
ఎంతకాలమయినా...
ఎదురుచూస్తూనే ఉంటాయి..
లిప్తకాలం ఆనందించే...
అనుభవం కంటే...
జీవితకాలం అనుబంధం కోసం...
చేసే నిరీక్షణ ....
ఎంతో మధురమని....
నాకు తెలుసు...
మనస్వినీ...

No comments:

Post a Comment